బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది. విద్యార్థులు అవామీ లీగ్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళన చేపట్టారు. పరిస్థితులు అదుపులో లేకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రత్యేక విమానంలో భారత్‌కు పారిపోయి వచ్చారు. బంగ్లాదేశ్‌లో పాలన సైన్యం చేతిలోకి వచ్చింది. అయినప్పటికీ పరిస్థితులు చల్లారలేదు.
ఇదే సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నిరసన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలి ఉన్న ఓ వ్యక్తి ఈ నిరసనలో పాల్గొన్నాడు. కోహ్లీకి డూప్‌లా ఉండటమే కాదు… రాయల్ ఛాలెంజర్స్ క్యాప్‌ను ధరించి ఆందోళనలో పాల్గొన్నాడు. షేక్ హసీనా రాజీనామా తర్వాత అక్కడి విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో కోహ్లీని పోలిన సదరు వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.