వేసవి నుంచి ఉపశమనం ఇచ్చే వర్షాకాలం లో అడుగు పెట్టాం.. వర్షాలు వస్తూనే సీజనల్ వ్యాధులను కూడా తెస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలతో పాటు వైరల్ జ్వరం బారిన ఎక్కువ మంది పడతారు. రోగనిరోధక శక్తి తక్కువగా వారిలో వైరల్ జ్వరం సాధారణం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడతారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగం నుంచి అయినా అంటే ప్రేగులు, ఊపిరితిత్తులు మొదలైన వాటి ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు. ఇన్ఫెక్షన్ ఫలితంగా జ్వరం వస్తుంది. అధిక జ్వరం, కళ్ళు మంట, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
అయితే కొన్ని సార్లు జ్వరం వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటూ సొంత వైద్యం తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు కొన్ని సార్లు సొంతంగా తీసుకునే యాంటీబయాటిక్స్ వైరస్లను చంపలేవు. అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటే కడుపు పనితీరుపై ప్రభావం చూపుతుంది, మంచి గట్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, ఆమ్లతను కలిగిస్తుంది. ఒకొక్కసారి కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
వైరల్ ఫీవర్ ఒక అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి ఆవలించినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, వారి శరీరం నుంచి వచ్చే చిన్న చిన్న ద్రవాల్లోని బ్యాక్టీరియా సమీపంలో ఉన్న వ్యక్తీ శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా మారడానికి 16 గంటల నుండి 48 గంటల వరకు సమయం పడుతుంది.
లక్షణాలు ఏమిటి? ఎన్ని రోజులకు వెలుగులోకి వస్తుందంటే?
ఎవరికైనా అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, చలి, తలనొప్పి, బాడీ పెయిన్స్, విపరీతమైన అలసట, నీరసం అనిపించవచ్చు.
కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ కొన్ని జాతులు దోమల వలన లేదా వ్యాధి సోకిన వ్యక్తి రక్తం లేదా వీర్యం ద్వారా వ్యాపించవచ్చు.
వైరస్ సోకిన తర్వాత కొన్ని రకాల వైరల్ ఫీవర్ అభివృద్ధి చెందడానికి 21 రోజులు పట్టవచ్చు.
ఎలుక మలం లేదా మూత్రం స్మెల్ పీల్చినప్పుడు కొన్ని రకాల వైరల్ బ్యాక్టీరియా కూడా మానవ శరీరంలోకి ప్రవేశించే ఆకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైరల్ ఫీవర్ ఎవరికీ ఎక్కువగా సోకే అవకాశం ఉందంటే..?
అప్పటికే వైరల్ ఫీవర్ సోకిన రోగికి దగ్గరగా ఉన్నవారికి సోకే ప్రమాదం ఉంది. ఒక నిర్దిష్ట వైరల్ జ్వరం ప్రబలంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళడం వలన కూడా వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న ప్రాంతంలో నివసిస్తున్న వారికి కూడా వైరల్ ఫీవర్ వ్యాపించే అవకాశం ఉంది. జబ్బుపడిన వారితో కలిసి పని చేస్తున్న వారికి కూడా సోకే ప్రమాదం ఉంది కొన్ని రకాల జంతువులకు సమీపంలో ఉన్నా.. లేదా వైరస్ సోకినా వారిని తిన్నా, వాటిని వధించినా వైరల్ ఫీవర్ బారిన పడే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులకు వైరల్ ఫీవర్‌కు గురయ్యే అవకాశం ఉంది.
వైరల్ జ్వరం యొక్క లక్షణాలు ఏమిటి? వైరల్ జ్వరం ఎలా నిర్ధారణ అవుతుంది?
జ్వరం (ఒకొక్కసారి తీవ్ర జ్వరం, అంతలోనే జ్వరం తగ్గడం), అలసట,మైకము,బలహీనత,చలి,తలనొప్పి,కండరాలు శరీరం కీళ్ల నొప్పులు,టాన్సిల్స్ వాపు, జలుబు, ముక్కు దిబ్బెడ, ఛాతీ బరువుగా ఉండడం, గొంతు మంట, కళ్ళలో మంట, దగ్గు,చర్మం దద్దుర్లు,అతిసారం,వికారం,వాంతులు వంటివి కనిపిస్తాయి.
వైరల్ వ్యాధి నిర్ధారణ
వైరల్ జ్వరం లక్షణాలు చాలా వ్యాధులకు సాధారణం కనుక వైరల్ ఫీవర్ కు సంబందించిన నిర్దిష్ట రూపాన్ని నిర్ధారించడం కష్టం. రోగనిర్ధారణ నిర్ధారణ కొరకు డెంగ్యూ , మలేరియా , చికున్‌గున్యా , టైఫాయిడ్ మొదలైన ఏదైనా వ్యాధి వచ్చే అవకాశం ఉంది కనుక. వైద్యుల సలహా తో వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేయించుకోవాలి.
.