కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో మహిళలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. అందువల్ల మహిళలు ఎక్కువగా లాభం పొందవచ్చు. తపాలా శాఖ నిర్వహిస్తున్న ఈ మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం అనేది భారతదేశంలోని మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక ఈ పథకం ద్వారా మహిళలకు కేంద్ర ప్రభుత్వం 7.5% వడ్డీని అందిస్తుంది. అయితే మీరు ఈ ఖాతాని క్లోజ్ చేసినప్పుడు 7.5% వడ్డీకి బదులు 5.5% వడ్డీని పొందుతారు. మహిళలు ఈ స్కీం ద్వారా తక్కువ కాలానికి పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు.
అయితే ఈ పథకంలో మాత్రం మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీంలో మాక్సిమం పెట్టుబడి 2 లక్షలుగా నిర్ణయించడం జరిగింది.ఈ స్కీంకి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు భారతీయులై ఉండాలి. ఈ స్కీం కేవలం మహిళలు మరియు బాలికలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకానికి వ్యక్తిగత మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.స్త్రీలు ఈ పథకాన్ని పొందాలంటే పోస్ట్ ఆఫీస్ లేదా అధికృత బ్యాంకులలో MSSC అకౌంట్ ఓపెన్ చెయ్యాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన బాలికలు లేదా వారి తల్లిదండ్రులు ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి అర్హులవుతారు. ఇక ఈ పథకంలో ఖాతా తెరిచేందుకు మీరు ఫారమ్ 1 ని పూర్తి చేయాలి.