అక్రమకట్టడాలకు సహాకరిస్తున్న గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు…

google-display-ads-size-468x60-1

చర్యలు శూన్యం. సెటిల్మెంట్లో ముందు..
అక్రమకట్టడాలకు సహాకరిస్తున్న గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు…
నోటీసులు ఇచ్చిన ఆగని అక్రమకట్టడాలు…
నోటీసులు ఇచ్చి జేబులు నింపుకుంటున్న సిభ్భంది…
మున్సిపల్ అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న పోచంపల్లి ప్రజలు.

గుండ్లపోచంపల్లి. హుకుం: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి, మైసమ్మగూడాలో పెద్దమొత్తంలో అక్రమకట్టడాలు జోరుగా నడుస్తున్నాయు. అధికారులకు ఎంతమంది ఫిర్యాదు చేసిన నోటీసులు జారీ చేయడానికే అంకితమవుతున్నారే తప్ప చర్యలు చేపట్టడంలో మాత్రం శూన్యమని చెప్పుకోవచ్చూ. ఈ మున్సిపాలిటీ పరిధిలో సుమారుగా 30 నుండి 35 బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వీరందరూ మున్సిపల్ నుండి జి ప్లస్ టు కు పర్మిషన్ తీసుకున్నారని, దానిపై 2 ఫ్లోర్ లు ఎక్కువగా కట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై మున్సిపల్ ప్రజలు ఫిర్యాదు చేస్తే వారికి నోటీసులు జారీ చేశామని జవాబిఛ్చి చేతులు జాడించుకుంటున్నారని అధికారులపై మండి పోతున్నారు. అధికారుల పనితీరు సరిగాలేదని, నిబంధనలు పాటించే (రిటైర్డ్) కమిషనర్ రాములు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ప్రజలు ఫిర్యాదు చేస్తే వారిని పిలిపించి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ రాములు కొన్నిరోజుల క్రితం పదవి విరమణ పొందిన అనంతరం కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరిని ఇంచార్జ్ కమిషనర్ గా నిర్వహించారు. ఇప్పటికైనా ఇంచార్జ్ కమిషనర్ శ్రీహరి నోటీసులు తీసుకొనికూడా అక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1