ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్‌తో పీసీలు, ల్యాప్‌టాప్‌లు పలుమార్లు రీస్టార్ట్ అవుతున్నాయి. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ సమస్య ఏర్పడింది. విండోస్‌లో సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ క్రమమంలో కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అమెరికాలోని ఫ్రాంటీయర్ సంస్థ ప్రకటించింది.
కొన్ని ఆన్‌లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటనలో పేర్కొంది. ముంబయి, దిల్లీ ఎయిర్‌పోర్టుల్లో ఆకాశ ఆన్‌లైన్ సర్వీసులకు అంతరాయం కలిగింది. మరోవైపు ఆన్‌లైన్ సర్వీసుల్లో అంతరాయం కలుగుతుందని ఇండిగో, స్పైస్ జెట్ ప్రకటించాయి. విండోస్‌లో సమస్యపై ‘ఎక్స్’ వేదికగా పోస్టులు యూజర్లు పోస్టులు పెడుతున్నారు. విండోస్‌లో సమస్య కారణంగా హైదరాబాద్‌లోనూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ట్వీట్ చేసింది.