బీహార్‌ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్‌!

google-display-ads-size-468x60-1

పాట్నాలోని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ పంపిన నిందితుడిని అరెస్ట్ చేశారు. జులై 16న సీఎం కార్యాలయానికి బెదిరింపు మెయిల్ రావడంతో,   వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయంలో తనిఖీలు చేపట్టగా.. ఎటువంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. దీనిపై కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

బెదిరింపు మెయిల్‌ ఆధారంగా నిందితుడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. అతనిని 51 ఏళ్ల మహ్మద్ జాహిద్‌గా గుర్తించారు. నిందితుడు కోల్ కతాలోని బీబీ గంగూలీ స్ట్రీట్‌లోన ఓ చిన్న దుకాణం న‌డుపుతున్న‌ట్లు తెలిసింది. తను అల్ ఖైదా గ్రూపుకు చెందిన వాడినని మెయిల్ లో నిందితుడు పేర్కొన్నప్పటికీ, ప్రాథమిక దర్యాప్తును బట్టి అతనికి ఏ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధం వున్నట్టు ఆధారాలు లభించలేదు. 

కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో అరెస్టు చేసిన జాహిద్‌ను ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత పాట్నాకు తీసుకువస్తామని పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా పీటీఐకి తెలిపారు. 

సోమవారం కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో పాట్నా పోలీసుల బృందం అతన్ని అరెస్టు చేయ‌డంతో పాటు అత‌ను మెయిల్ పంపిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజీవ్ మిశ్రా తెలిపారు.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1