న్యాయవాదుల ఆందోళన మేడ్చల్ ప్రాంతంలో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ స్థబించి పోయింది. మూడు రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనేనేడు మేడ్చల్ కోర్టులో విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో మేడ్చల్ నాయ్యవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నా
0