అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతికపక్షాల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బతుకమ్మ చీరలు (Bathukamma Sarees), గొర్రెల స్కీమ్ (Sheep Distribution Scheme), కేసీఆర్ కిట్లు పథకాల (KCR Kits) అవకతవకలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి చేశారని అన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లలోనూ భారీగా అవినీతి జరిగిందని చెప్పారు. సూరత్ నుంచి నాసిరకం చీరలు తీసుకొచ్చి తెలంగాణ మహిళలకు ఇచ్చారని అన్నారు. రూ.వేలకోట్ల భూములను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. సభలో అన్ని లెక్కలు బయటకు తీస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
0