లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఈ కేసులో సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 17 నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దేశం విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పింది.
0