గుండ్లపోచంపల్లి హుకుం: వలస పాలకుల చేతిలో బందీలుగా ఉన్న భారతదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తరువాత అఖండ భారతం ఒకే దేశం ఒకే చట్టం ఉండాలనే సంకల్పంతో జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దుకై పోరాటం చేసిన క్రమంలో ఆనాటి పాలకుల చేతిలో అసువులు బాసిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా అమ్మను గుర్తు చేసుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడంతో పర్యావరణానికి మేలు చేసిన వారవుతామని బీజేపీ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నాయకులు అన్నారు. గురువారం మున్సిపాలిటీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పట్లొల్ల విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి కౌన్సిలర్లు సముద్రాల హంస రాణి, అమరం సరస్వతి, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, రజిత ముదిరాజ్, బిజెపి మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు అమరం మోహన్ రెడ్డి, సముద్రాల కృష్ణ గౌడ్, కిషన్, వెంకటేష్, అర్జున్ బాబు, మల్లేష్, పిడుగుల నాగరాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు
0