తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి… కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన రేవంత్…. కాంగ్రెస్ అగ్ర నేతలను కలిశారట.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఒక్కరిది కాదని… అందరి నిర్ణయాలు గౌరవించాలని రాహుల్ గాంధీ చురకలాంటించారట. ఒంటెద్దు పోకోడాలతో ఎందుకు వెళ్తున్నామని ఫైర్ అయ్యారట.సీనియర్ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదని… అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలని ఆదేశించారట. జాతీయస్థాయిలో బిజెపి కూల్చివేతలకు వ్యతిరేకంగా… తాను పోరాటం చేస్తుంటే.. నువ్వు హైదరాబాదులో హైడ్రా పేరుతో కూల్చుతావా? అని నిప్పులు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అటు కేసి వేణుగోపాల్ తో.. కూడా ఇదే అంశాన్ని తెలిపారట. దీంతో.. రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ కూడా క్లాస్ పీకినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
HukumNews
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామి మూల విరాట్టును భానుడి కిరణాలు మంగళవారం ఉదయం తాకాయి.. ఉదయం 6.05 గంటలకు సూర్య కిరణాలు ధ్వజ స్తంభం మీదుగా స్వామిని చేరాయి. ఆ సమయంలో మూల విరాట్ బంగారు ఛాయలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేకువజాము నుంచే క్యూ లైన్లలో బారులు దీరారు..
సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి వేళ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
రజినీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో పాటు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ముందుగానే ప్లాన్ చేసుకున్న ఈ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారు. గుండెకు సంబంధించిన పరీక్షల కోసం రజినీకాంత్ చేరినట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రజినీకాంత్ సన్నిహితులు తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపై రజినీకాంత్ కుటుంబ సభ్యులు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
ఇక ప్రస్తుతం రజినీకాంత్ వెట్టయాన్, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. వెట్టయాన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నవరాత్రులకు ముందు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఇది చేదువార్తే. వరుసగా మూడవ నెల అక్టోబర్‌లో కూడా గ్యాస్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు నేటి (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి.
కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.
ఉగ్రభీమరథంపై ఉప -ఇంద్రుడు
క్రిష్టాయగూడెంలో జననమై,
వైదిక విద్యల్లో సుశిక్షితుడివై,
జీవన శృతిలో సహధర్మచారిణిగా చేరిన రజితము సైతం స్వర్ణమంగళిగా కలిసిపోయి సప్తపది వేయగా..
ఓరుగల్లున శ్రీరుద్రేశ్వరుని నిత్యార్చనలో మణికంఠ హారమై పూజిస్తూ.. తరిస్తూ..
ఉప్పన్న అనగానే ఉప్పొంగి నేనున్నా అంటూ..
బ్రాహ్మణ,అర్చక, పురోహితాదు లందరి బాధలు తీర్చే ఆపద్భాందవుడిగా శ్రమిస్తూ..
శ్వేత వస్త్ర శోభతో భాసిస్తూ..
సుధాకరమైన సంభాషణలు దివ్యముగా భాషిస్తూ..
రాజన్యులు సైతం త్రిపురా పురాన నిను చేరి ఆశీస్సులు పొందేలా పయనం సాగిస్తున్న
తమ జీవన పయనం నేటికి
ఐరావతంపై అక్కడ ఆ ఇంద్రుడు
ఉగ్రభీమరథుడిగా ఇక్కడ
మా ఉప ఇంద్రుడు అన్నట్టు అనిపిస్తోంది.
ఇలాగే శతవసంతాలు సధర్మకాముకుడిగా కామాఖ్య చిద్విలాసంచేత శోభిల్లే నిత్య క్రాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తూ..
“సిద్దాంత శిరోమణి,జ్యోతిర్వాస్తు సామ్రాట్, ప్రతిష్ఠా సార్వభౌమ, జ్యోతిష్యభీష్మ, మంత్రశాస్త్ర విభూషణ”
డా॥ శ్రీ అవసరాల ప్రసాద శర్మ సిద్ధాంతి,శ్రీమతి సత్య వాణి
శ్రీ చండీ పరమేశ్వరి వైదిక ఆగమ జ్యోతిష వాస్తు విజ్ఞాన పీఠం పీఠాధిపతి
తెలంగాణా బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ఆస్థాన సిద్ధాంతి
78వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా బోయిన్ పల్లి మాలిక్ మోటార్స్ సిబ్బంది షోరూమ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేసి స్వీట్స్ పంచారు. అనంతరం బోయిన్ పల్లి నుండి ఆర్.సి పురం వరకు జాతీయ జెండా లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ, రాష్ట్ర ప్రజలందరికి 78 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో కార్తీక్, అఖిలన్, రషిద్, విజయ్, శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
జగన్ అన్యాయం చేశారు.. మీరైనా న్యాయం చేయండి: ఏపీ మాజీ స్పెషల్ పోలీసులు
ఎలాంటి నోటీసు లేకుండా గత ప్రభుత్వం తమను ఉన్నట్టుండి విధుల నుంచి తొలగించిందని ఏపీ మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (సివిల్స్) వాపోయారు. రెండేళ్ల వెట్టిచాకిరీ తర్వాత జగన్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ముందు వారంతా ధర్నా చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జనవరి 2న రాష్ట్రవ్యాప్తంగా 2156 మందిని ఎస్పీఓలుగా నియమించిందని ఏపీ ఎస్పీఓల సంఘం రాష్ట్ర నాయకులు ధర్మ చంద్, చిట్టిబాబు చెప్పారు. నాటి ముఖ్యమంత్రి జగన్ ఇందుకోసం ప్రత్యేక జీవో జారీ చేశారని వివరించారు. తమను బార్డర్ చెక్ పోస్టులు, నార్కోటిక్, ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాల్లో నియమించి విధులు అప్పగించారని తెలిపారు. రెండేళ్ల పాటు రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి, ఉమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టామని వారు చెప్పారు. అయితే, 2022 మార్చి 31న ప్రభుత్వం ఎస్పీఓలు అందరినీ తొలగించిందని వాపోయారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ అప్పట్లో సీఎం జగన్, మంత్రుల పేషీల చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా తమ సమస్యను పట్టించుకోలేదని ధర్మ చంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీఓలు విధుల్లో లేకపోవడంతో గల్లీగల్లీలోనూ గంజాయి దొరుకుతోందని, ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకునే వారే లేకుండా పోయారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పే కూటమి ప్రభుత్వం కూడా చేయకూడదని అభ్యర్థించారు. అక్రమ రవాణాకు, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ధర్మ చంద్, చిట్టిబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పారిస్ ఒలింపిక్స్ లో మన చిన్నోడు.. రెజ్లింగ్‌లో కాంస్య పతకం గెలిచిన 21 ఏళ్ల కుర్రాడు
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పురుషల రెజ్లింగ్ కాంస్య పోరులో 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ తొలి పతకం సాధించాడు. 57 కిలోల విభాగంలో అమన్ .. ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రజ్ను 13-5తో ఓడించి ఈ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెజ్లింగ్‌లో తొలి పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మొత్తం 6 ఒలింపిక్స్ మెడల్స్ చేరాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి.
ఒలింపిక్స్ బరిలో భారత్ తరఫున బరిలోకి దిగిన ఏకైక మేల్ ప్లేయర్ అమన్. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా అమన్ రికార్డుకు ఎక్కాడు. అమన్ కంటే ముందే ఈ రికార్డును బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు కాంస్య పోరులో అమన్ విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అమన్ అంకితభావం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఎక్స్ వేదికగా కొనియాడారు. ఈ ఘనతను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరికి గోతులు తవ్వుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ?
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరికి ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గోతులు తవ్వుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి ను గెలవనీయకుండాకుండా చేసే కుట్రలు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు.
ఇందులో భాగంగానే… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరికి ఓటేయొద్దని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్. ఒక్కరికే రెండు పదవులు ఉంటే ఎట్లా.. ఎమ్మెల్సీ పదవి ఉండగా యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకని బాహాటంగానే ప్రశ్నించారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పాఠశాలలో కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్ ను ముద్దు పెట్టమని అడిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. టీచర్లు, పిల్లల కోసం యుపి ప్రభుత్వం డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఉన్నావో ప్రాంతంలో అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్ ముద్దు పెట్టమని అడిగాడు. సదరు టీచర్ ముద్దు పెట్టేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు సదరు ఉపాధ్యాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు ఇలా దారి తప్పితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముద్దు పెట్టమని అడిగినప్పుడు లేడీ టీచర్ అతడి చెంపపై చెప్పుతో కొట్టాల్సిందని మరో నెటిజన్ కామెంటు చేశాడు.