కూకట్‌పల్లిలో ప్రియాంక అనే మహిళను హత్య చేసిన నిందితురాలు మంజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ జోన్ డిసిపి సురేష్ కుమార్ అదనాపూర్ డిసిపి సత్యనారాయణ లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక అనే మహిళ వ్యభిచారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఇదే వృత్తిలో ఉన్న మంజుల ఎల్లంబండా ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వ్యభిచారం వృత్తిని కొనసాగిస్తుంది. ఇదే సమయంలో ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడి ప్రియాంక దగ్గర ఉన్న చెవి పోగులు, వెండి ఆభరణాలు మంజుల దగ్గర దాచి పెట్టింది. గత నెల 30వ తేదీన తన బంగారు వెండి వస్తువులు ఇవ్వాలని మంజులను కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ప్రియాంక తనకు తెలిసిన వారితో మంజులను బెదిరించి బంగారు చెవిపోగులు వెండి అభరణాలను తీసుకుంది. దీంతో ప్రియాంకతో తనకు ప్రాణమని ఉన్నదని గుర్తించిన మంజుల ప్రియాంకను తన ఇంటికి తీసుకువెళ్లి మద్యం బాగా తాగించి అనంతరం ప్రియాంక స్కూటీ పైన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోధా అపార్ట్మెంట్ ముందున్న ఉదాశీన్ మటం ఖాళీ స్థలంలో చెత్తకుప్పలో పడవేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేసి,మంజుల నేరం తన మీదికి రాకుండా ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేశారని నమ్మించడానికి ప్రియాంక బట్టలు మొత్తం చింపి ప్రియాంక యోని పై భాగంలో మొత్తం ఓపెన్ చేసి పెట్టి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలును అదుపులోకి తీసుకొని విచారించగా నేరం తనే చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు బాలానగర్ జోన్ డిసిపి సురేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి సత్యనారాయణ, కూకట్పల్లి ఏసిపి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ముత్తు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
HukumNews
Breaking : లాలు ప్రసాద్ యాదవ్, తేజస్వీయాదవ్‌కు ఊరట.. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కేసులో బెయిలు
‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే బెయిలు మంజూరు చేస్తూ ఒక్కొక్కరు రూ. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా వారిని అరెస్ట్ చేయరాదని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ముగ్గురూ తమ పాస్‌పోర్టులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇంకా సర్దుమనక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ సారి శమరిమల ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, అందులో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు తయారు చేసిన అరవణ ప్రసాదం డబ్బాలను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం ఉంది. వీటిని గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉంచేశారు.
ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా అధిక మోతాదులో క్రిమిసంహారకాలు కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. అందువల్లనే అరవణ ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. అయితే, ‘అరవణ’ను పెద్ద మొత్తంలో పారవేయడం అధికారులకు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. అటవీ ప్రాంతాల్లో పారవేసేందుకు అధికారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి టీడీబీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది.
ఈ టెండర్‌ను కేరళకు చెందిన ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ (ఐసీఈఎస్) టెండర్లను దక్కించుకుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ డీహెచ్‌కి తెలిపారు. వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని తమ సదుపాయానికి తీసుకెళ్లిన తర్వాత ‘అరవణ’ను శాస్త్రీయంగా ఎరువుగా మార్చాలని వారు ప్రతిపాదించారు. తొలుత కేరళలోని కొట్టాయంలో ఉన్న తమ గూడెంకి తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళతారు. ‘అరవణ’ను శాస్త్రీయంగా పారవేసేలా టీడీబీ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం (IAF) ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు.
100 మందికిపైగా గాయపడ్డారు. గాలి ఆడక 230 మంది సొమ్మసిల్లి పడిపోయారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. అలాగే మెరీనా బీచ్ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి ఎంఆర్టీఎస్ రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంల్లో నిలబడేందుకు స్థలం లేకుండా పోయింది.
ఇక ఈ ఎయిర్ షోకు దాదాపు 10 లక్షలమంది హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో లు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ(Telangana) లో మరో రెండు రోజుల పాటు వర్షాలు (Rains) కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఆదివారం సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం,నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది.
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు(Tamilanadu) , దక్షిణ ఆంధ్రప్రదేశ్(AP) తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలో యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ ప్రభావం అక్టోబర్ 7, 8 తేదీల్లో యూపీ, బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో కనిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది.
పల్నాడు జిల్లాలో ఓ బ్యాంక్‌లో భారీ కుంభకోణం ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో నరేశ్ మేనేజర్‌గా, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ పనిచేశారు. ఇలా పనిచేస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి రూ.కోట్ల రూపాయిల నగదును ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులు లాక్కున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేటకి చెందిన పొత్తూరి కోటేశ్వరమ్మ ఈ బ్రాంచ్‌లో రూ.45 లక్షలు డిపాజిట్ చేశారు.
ఏడాది అయిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేస్తున్నానని ఆమెకు చెప్పి ఆ డబ్బును తన ఖాతాకు బదిలీ చేసుకున్నారు. ఇలా మరికొందరికి చెందిన రూ.79 లక్షలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అయితే ఖాతాదారులకు అనుమానం రాకుండా ప్రతి నెల వడ్డీ కూడా బ్యాంకు నుంచి వేశారు. రూ.లక్ష రుపాయలకు వెయ్యి చొప్పున అకౌంట్లలో వేశారు. ఈ డబ్బులు ఇటీవల ఆగిపోవడంతో సందేహం వచ్చి బ్యాంకు దగ్గరు వెళ్లి అడగ్గా ఈ విషయం బయట పడింది. ఎందరో ఖాతాదారుల సొమ్మును బదిలీ చేశారని తెలియగా.. వారు బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. అయితే ఈ కుంభకోణంలో గోల్డ్ అప్రైజర్ హరీశ్ కూడా ఉన్నాడని ఆరోపిస్తున్నారు.
ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం తాకట్టు చేసిన రుణాల్లో మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంక్ విజయవాడ జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజినల్ మేనేజర్ రమేశ్ ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించారు. మొత్తం 14 మంది ఖాతాదారుల నుంచి రూ.6.90 కోట్ల నగదు, 115 సవర్ల బంగారం కుంభకోణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. షేక్ బాజిబీ అనే మహిళ పేరు మీద ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు, బంగారం రుణాలు ఉండటంతో ఆమె ఖాతాల్లోంచి నగదు భారీగా బదిలీ చేసుకున్నారు.
తెలంగాణలో పోలీస్ ప్రక్షాళన షురూ అయ్యింది. అక్రమ దందాకు వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులపై వేటు పడింది. మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను VR లో పెడుతూ మల్టీజోన్-2 ఐజీపీ వి. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సదరు అధికారులను బదిలీ చేయడం జరిగింది.
ప్రస్తుతం వేటు పడినవాళ్ళలో సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(S), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా, ఎస్ఐలను VR లో పెట్టారు. వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్ష సహకారం ఉండటంతో వారిపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలో వీరిని లూప్ లైన్‌కు ట్రాన్స్‌ఫర చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర ఎంక్వయిరీల ఆధారంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు.
ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. అదేవిధంగా వాగుల్లో, నిషేధిత నది ప్రాంతాలలో ఎక్కడబడితే అక్కడ విచక్షణ రహితంగా ఇసుకను తవ్వకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పర్యావరణ సమతుల్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ ఈ విషయంలో సీరియస్‌గా ఉండడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని ఐజీ తెలిపారు. ఇప్పటి నుండి ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అలాగే, కొండమల్లేపల్లి హోంగార్డు, జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ అక్రమ ఇసుక రవాణాలో వసూళ్లు పాల్పడటంతో DAR కు అటాచ్ చేయడం జరిగింది. ఇక తదుపరి చర్యలు PDS రైస్ అక్రమ రవాణా మీద ఉంటుందని ఐజీ హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందన్నారు. PDS రైస్ అక్రమ రవాణాలో స్థానికులే కాకుండా, అంతర్రాష్ట్రంగా చేసే ప్రధాన నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఐజీ సత్యనారాయణ ఆదేశించారు. PDS రైస్ అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా, గాంబ్లింగ్, మట్కా పూర్తిగా బంద్ కావాల్సిందేన్నారు. గాంబ్లింగ్, మట్కా జరిగితే సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే వికారాబాద్‌లోని మర్పల్లిలో గెస్ట్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్న ప్రభాకర్ సేట్, రఫిక్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఐజీ సత్యనారాయణ. రఫీ మీద Suspect Sheet ఓపెన్ చేయడం జరిగింది. పేద, మధ్య తరగతి వ్యక్తుల నుండి దోపిడి చేసే ఈ గాంబ్లింగ్ పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ఆయన స్పష్టం చేశారు. మల్టీజోన్-2 లో గాంబ్లింగ్ వాసనే రాకూడదు. జిల్లాల్లో ఎక్కడ కూడా గాంబ్లింగ్ జరగకుండా చూసే బాధ్యత అయా జిల్లాల SP లదే అని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్..!
ఇదిలావుంటే, బాధ్యతాయుతంగా వ్యవహారించాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదీలేదన్నారు ఐజీ సత్యనారాయణ. ఈ క్రమంలోనే వికారాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్పై వేటు వేశారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినందుకు జోగిపేట ప్రస్తుతం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ.నాగరాజును సస్పెండ్ చేశారు..
సినిమా వాళ్లకు ఏదైనా అంటగట్టేస్తారా? ఇండస్ట్రీ అంటే అంత చులకన ఎందుకు?
ఓ పార్టీకి మరో పార్టీకి మధ్య యుద్ధం.. తన ఫోటోని ట్రోల్ చేశారని ఆ మంత్రి ప్రతిపక్ష నేతను టార్గెట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ట్రోల్ చేసినందుకు ఓ సినీ నటి కుటుంబం పరువుని బజారులో పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరులో సమంత బలైంది. రాజకీయం కోసం ఇంతలా దిగజారాలా? సినిమా వాళ్ల జీవితాలను అడ్డం పెట్టుకోవాలా? ఇండస్ట్రీ అంటే అంత చులకనా? లేక చిన్న చూపా? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో.
నిన్న రకుల్, నేడు సమంత, మరి రేపు ఎవరు? మరో హీరోయిన్ బలి కావాల్సిందేనా.. వివాదం ఏదో అయితే, యుద్ధం ఎక్కడో జరిగితే దాన్ని సినిమాకి, సినిమా వాళ్లకు ఆపాదించడం ఏంటి? ఇండస్ట్రీ అంటే మరి ఇంత చులకనా? సెలెబ్రిటీ జీవితం అన్నా, వ్యక్తిత్వం అన్నా.. ఇంత చిన్న చూపా? ప్రభుత్వ పెద్దలే ఇలా ఉన్నారంటే.. ప్రజల పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా ట్రోలింగ్ కు హీరోలు, హీరోయిన్లు బలి కావాల్సిందేనా? ఇండస్ట్రీ అంటే ఇంత లోకువ ఎందుకు?
సినిమా సెలెబ్రిటీలు అన్నా, వాళ్ల లైఫ్ అన్నా.. ప్రతీ ఒక్కరికీ చులకనే. ఈజీగా ఓ మాట అనేస్తుంటారు. ఓ నిందను తోసేస్తుంటారు. ఇప్పుడు సమంత విషయంలోనే కాదు.. గతంలో చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. అసలీ పరిస్థితి కారణం ఏంటి? కలర్ ఫుల్డ్ అనిపించే సినిమా ఇండస్ట్రీకి ప్రతీసారి ఈ మరకలేంటి? ఎందుకు ప్రతిసారి చులకన అవుతోంది? మారటం ఎలా?
సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఒక్క తాటిపైకి వచ్చి సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. దీంతో ఆ పార్టీ పెద్దలు కూడా దిగొచ్చారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామన్నారు. ఇలా సమంత ఎపిసోడ్ ఓ ఆన్సర్ చూపించింది అనే చర్చ జరుగుతోంది. వివాదం చిన్నదైనా, పెద్దదైనా.. అంతా కలిస్తే ఎవరైనా దిగి రావాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీలో ఎవరి మీద ఎలాంటి ఆరోపణ వచ్చినా, విమర్శలు వినిపించినా.. ఇండస్ట్రీ అంతా ఏకమైతే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని, ఇండస్ట్రీ అంటే చులకన భావం పోయే పరిస్థితి ఉందని అంటున్నారు. మరి ఇండస్ట్రీలో ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే లేవు అనే సమాధానమే వినిపిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ఉంది. కుటుంబాల మధ్య, హీరోల మధ్య కూడా నిప్పులు రేగుతున్నాయి. ఇలా ఉంటే, సమస్యకు పరిష్కారం ఎలా అని ప్రశ్నించే వాళ్లు మరికొందరు. ఇక ఇండస్ట్రీని మరింత లోకువ చేస్తోంది, ఇబ్బంది పెడుతోంది ట్రోలింగ్, తప్పుడు ప్రచారాలు. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యే కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లను మా బ్యాన్ చేయించింది. ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ పెద్దలను కలిసి సోషల్ మీడియాలో పరిశ్రమపై జరుగుతున్న విష ప్రచారానికి బ్రేకులు పడేలా చర్యలు తీసుకుంటే మంచిది.
ఆపరేషన్ మూసీలో మరో లేటెస్ట్ పరేషాన్ మొదలైంది. ఓవైపు రివర్ బెడ్లో ఇళ్ల కూల్చివేత, నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు నిరసనలు భగ్గుమంటున్నాయి. పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నమామి గంగా ప్రాజెక్టులో 2 వేల 500 కిలోమీటర్ల దూరానికి కేంద్రం 20 వేల కోట్లు ఖర్చు చేయలేదు. మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఐతే, ఈటల మూసీ బాటలో వుంటే మల్కాజ్గిరి అడ్డాగా విపక్షాలపై విమర్శల ఈటెను విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.
పేద వాళ్ళు ఎప్పడూ మూసిలోనే ఉండాలా..? మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా..? అంటూ విపక్షాలపై విమర్శలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. మేం ఎవరినీ వదలం..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. సీఎం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేయడం కాదు.. ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు.
ప్రధాని మోదిని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే.. అంతకన్నా ముందు మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శెభాష్ అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు.
అలా మూసీ పే సవాళ్ల సౌండ్ మాత్రమే కాదు… మల్కాజ్‌గిరిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ప్రొటోకాల్ రచ్చ రాజుకుంది. తనను ఆహ్వానించకపోవడంపై లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రొటోకాల్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో రివ్యూ చేస్తామని స్పందించారు మంత్రి శ్రీధర్‌బాబు. మూసీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఛాలెంజ్‌పై తగ్గేదేలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఒక రాష్ట్రం.. ఒకే గుర్తింపు కార్డు జారీకి ఏర్పాట్లు చేయనుంది. ప్రజలు సులభంగా, తొందరగా రాష్ట్రంలో ఎక్కడైనా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గుర్తింపు కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సికింద్రాబాద్ హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలతో పాటు మిగతా వాటి అమలు పని చేసే విధంగా డిజిటల్ కార్డులు ఉంటాయి. కుటుంబ కార్డులు తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఇవ్వనున్నారు. ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది. అలాగే కుటుంబంలోని సభ్యులకు వ్యక్తిగత నంబర్లు కూడా ఉంటాయి. కుటుంబ వివరాలు అన్ని జాగ్రత్తగా సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే అమలు అవుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో డిజిటల్ కార్డుల విధానాన్ని అధికారులు పరిశీలించారు. అన్నింటిని అధ్యయనం చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేలా మార్పులు చేస్తూ కొత్తగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ప్రస్తుతానికి వైద్యారోగ్య, పౌరసరఫరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు కార్డులు అందించాలని నిర్ణయించారు. కానీ ఇంకా ఇతర సేవలనూ కూడా కలపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 119 పట్టణాలు, 119 గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించనున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుల స్థానంలో వీటిని రిప్లేస్ చేయనుంది. ఈ డిజిటల్ కార్డుల సర్వేలో పర్యవేక్షణ కోసం కొందరు స్పెషల్ ఆఫీసర్లను కూడా ప్రభుత్వం నియమించింది.