ఇజ్రాయెల్‌పై 400 క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్..

google-display-ads-size-468x60-1

పశ్చిమాసియాలో భీకర యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా 400కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులతో ప్రత్యక్ష దాడులకు దిగింది.

దాంతో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. దేశ ప్రజలను అప్రమత్తం చేయడంతో మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లు ప్రస్తుతం బాంబు షెల్టర్‌లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ కూడా ఈ ఇరాన్ దాడులను ధ్రువీకరించింది.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇటీవలి పరిస్థితుల అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా నివాసితులు ఇప్పుడు రక్షిత స్థలాలను విడిచిపెట్టడానికి అనుమతించినట్టు ప్రకటించింది. అయితే, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ నుంచి కొనసాగుతున్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. ఆకాశంలో నుంచి రాకెట్లు దూసుకువస్తున్న సమయంలో రాబోయే ముప్పును అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసింది.

“కొద్దిసేపటి క్రితం.. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ రాష్ట్రం వైపు క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లు అప్రమత్తంగా ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. గత కొద్ది నిమిషాల్లో, హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలను రక్షించే సూచనలను చేసింది. ఇజ్రాయెల్ రాష్ట్రంలోని పౌరులను రక్షించడానికి ఐడీఎఫ్ అవసరమైన ప్రతిదాన్ని చేస్తుంది” అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

అంతకుముందు, ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలు పెరగడంతో మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లు ప్రస్తుతం బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. “ఇజ్రాయెల్ అంతటా ఉన్న మా సోదరులు, సోదరీమణులకు, మీలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం” అని ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1