ఏళ్లు గడుస్తున్న హై టెన్షన్ రహదారికి మోక్షం కలగడం లేదు

google-display-ads-size-468x60-1

ఏళ్లు గడుస్తున్న హై టెన్షన్ రహదారికి మోక్షం కలగడం లేదు కూకట్పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్ సమీపం లో ఉన్న హై టెన్షన్ రహదారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. ఓవైపు రోడ్డు నిర్మాణం చేపట్టి మరోవైపు వదిలేయడంతో మాధవరం నగర కాలనీవాసులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. నిత్యం ఈ రహదారిలో వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రోడ్డు పూర్తి చేస్తే కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనేకమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న దాఖలు లేవు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1