జీఎస్టీలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆ శాఖ సంయుక్త కమిషనర్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెయ్యి కోట్ల కు పైగా జరిగిన స్కామ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌పై కేసు నమోదయింది. వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ ఎస్.వి.కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిందితులుగా ఉన్న ఈ కేసులో అయిదో నిందితుడిగా సోమేశ్ కుమార్‌ను చేర్చారు.
పన్ను ఎగవేతదార్లకు ఆయన సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆశాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు రూ.1000కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు 400 కోట్ల రూపాయలు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు తెలిపారు. నిందితుల పై 406,409, 120బి తో పాటు ఐటిఏ 65 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.