శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బోనాల సంబురం

google-display-ads-size-468x60-1
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

హైదరాబాద్: చింతల్, పద్మనగర్ లోని శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను రంగ వల్లులు, పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు బోనం కుండలను ఇంటి వద్దనే అందంగా అలంకరించుకొని పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. దుర్గా మాత చిత్రపటానికి పూల మాల వేసి పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు బోనాల ఉత్సవాలు పల్లెల్లోనే కాకుండా, విదేశాల్లో సైతం వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు దోహదపడుతాయని తెలిపారు. పంచభూతాలను గ్రామదేవతలుగా భావించుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్‌ కోమలా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1