కంటితుడుపు చర్యగా ప్రజావాణి

google-display-ads-size-468x60-1

జీహెచ్‌ఎంసీలో ప్రజావాణి కంటితుడుపు చర్యగా మారింది. దూర ప్రాంతాలు నుంచి వచ్చి..ఎంతో ఆశగా అపరిష్కృత సమస్యను మేయర్‌, కమిషనర్‌కు విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుతున్నది. గడిచిన నాలుగు వారాలుగా ప్రతి సోమవారం నిర్వహించే ఈ విశిష్ట కార్యక్రమంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ ఆమ్రపాలి పాల్గొనడం లేదు. మేయర్‌, కమిషనర్‌ లేని ప్రజావాణిని ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా ముగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పైగా ప్రజావాణిలో ఒకసారి కాకుంటే మరోసారి వచ్చి ఫిర్యాదు చేసినా.. లాభం ఉండటం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 6 నెలల నుంచి జీతాలు లేక బతకడమే కష్టంగా మారిందని ఈఎస్‌ఐ ఆసుపత్రి స్వీపర్స్‌, సెక్యూరిటీ సిబ్బంది అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. తమను నియమించిన ఏజెన్సీలు తమకు జీతాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇప్పటికీ నాలుగు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ లేబర్‌ ఆఫీసర్‌ను కలవాలని చెబుతున్నారని.. అక్కడికి వెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు సాజీదా బేగం, సుజాత, రజినీ, యాదమ్మ మాట్లాడుతూ.. ‘మాకు జనవరి నుంచి ఇప్పటి వరకు జీతం ఇవ్వలేదు. ఆ డబ్బులొస్తేనే మా పిల్లలకు స్కూలు, కాలేజీల ఫీజులు చెల్లించగలం. ఇంటి కిరాయి కట్టుకోగలం. కడుపునిండా అన్నం తినగలం. ఆ జీతం రాక రోజు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అని వాపోయారు.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1