జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా భరత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, ఏఎంసి చైర్మన్ కొండకింది పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు,ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాళ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
02/10/2024
పశ్చిమాసియాలో భీకర యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా 400కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో ప్రత్యక్ష దాడులకు దిగింది.
దాంతో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. దేశ ప్రజలను అప్రమత్తం చేయడంతో మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లు ప్రస్తుతం బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ కూడా ఈ ఇరాన్ దాడులను ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇటీవలి పరిస్థితుల అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా నివాసితులు ఇప్పుడు రక్షిత స్థలాలను విడిచిపెట్టడానికి అనుమతించినట్టు ప్రకటించింది. అయితే, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ నుంచి కొనసాగుతున్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. ఆకాశంలో నుంచి రాకెట్లు దూసుకువస్తున్న సమయంలో రాబోయే ముప్పును అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసింది.
“కొద్దిసేపటి క్రితం.. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ రాష్ట్రం వైపు క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లు అప్రమత్తంగా ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. గత కొద్ది నిమిషాల్లో, హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలను రక్షించే సూచనలను చేసింది. ఇజ్రాయెల్ రాష్ట్రంలోని పౌరులను రక్షించడానికి ఐడీఎఫ్ అవసరమైన ప్రతిదాన్ని చేస్తుంది” అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
అంతకుముందు, ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలు పెరగడంతో మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లు ప్రస్తుతం బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. “ఇజ్రాయెల్ అంతటా ఉన్న మా సోదరులు, సోదరీమణులకు, మీలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం” అని ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు ప్రజలకు కేవలం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత నెల 27 నుంచి ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్లో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. దీనికోసం నగరంలోని ఆటో డ్రైవర్లతో ఒప్పందం చేసుకుంది.
ఇక రూపాయికే ఆటో రైడ్ కావడంతో దీనికి మంచి స్పందన వస్తోంది. కేవలం రూ.1 చెల్లించి బెంగళూరు వాసులు ఆటో రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పీక్ అవర్స్ లో రద్దీ దృష్ట్యా సంస్థ పలు ప్రాంతాల్లో స్టాళ్లను కూడా ఏర్పాటు చేసింది.
“ఫ్లిప్‌కార్ట్ యూపీఐ అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో రద్దీ సమయాల్లో ఒక్క రూపాయికే ఆటో రైడ్లను అందించడం జరుగుతుంది. రూ.1కి ఏదీ లభించని ఈ సమయంలో మా ప్రచారం చరిత్ర సృష్టించింది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చూపిస్తూ జీవితాన్ని సులభతరం చేస్తోంది. చౌకగా లభిస్తోంది” అని ఆ సంస్థ పేర్కొంది.
ఇక ఒక్క రూపాయికే ఆటో రైడ్ అందుబాటులో ఉండడంతో నగర వాసులు భారీ సంఖ్యలో క్యూ కట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో తమ ప్రచారానికి అద్భుత స్పందన లభించిందని కంపెనీ వెల్లడించింది. రద్దీ సమయాల్లో ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు నగదురహిత సేవలను ప్రమోట్ చేసేందుకే ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఫ్లిప్‌కార్ట్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఆఫర్‌ను బెంగళూరుకే పరిమితం చేయకుండా తమ ప్రాంతాలలో కూడా ప్రవేశపెట్టాలంటూ ఫ్లిప్‌కార్ట్‌ను పలువురు కోరుతున్నారు. ఇలాంటి సేవలు పొందకుండా ఉండేందుకు తామేం తప్పు చేశామని, తమకూ తక్షణమే ఇలాంటి ఆఫర్ ప్రకటించాలని ఇతర ప్రాంతాల వాసులు కంపెనీని కోరుతున్నారు.
తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. మొత్తం 9 రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకల్లో గౌరమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పూజిస్తారు. భాద్రపద అమావాస్య నాడు ప్రారంభం అయ్యి మొత్తం 9 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. పూలతో గౌరమ్మను తయారుచేసి ఆడపడుచులు ఆటపాటలతో సందడి చేస్తారు.తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి వంటి పూలతో చేస్తారు. అయితే ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేయడానికి ముందు రోజే పూలు తెచ్చి నీళ్లలో వేసి ఉంచుతారు. పువ్వులు ఇలా నిద్ర చేయడంతో వీటిని ఎంగిలి పూలు అంటారు. ఇంటి పెద్దలకు పూజించి కొంచెం భోజనం చేసి.. ఇలా తెచ్చిన పువ్వులతో తొలిరోజు గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భోజనం చేసిన తర్వాత బతుకమ్మను తయారు చేయడం వల్లనే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెప్పుకుంటారు. తొలి రోజు వేడుకల్లో నువ్వులు, నూకలు, బియ్యంపిండితో తయారు చేసిన వంటలను గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు. ఇలా మొదటి రోజు బతుకమ్మను పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు.
తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే!
తిరుమల శ్రీవారి ప్రస్తాదం లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు ప్రాశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు.
ఇక మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేటి ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కూతరు పొలెనా అంజని కొణిదెలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
పవన్ చిన్న కుమార్తె క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్‌పై సంతకాలు తీసుకున్నారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు. కాగా, రాష్ట్రంలో డిక్లరేషన్ విషయమై వివాదం నెలకొన్న వేళ జనసేనాని చేసిన పనితో ఒక విధంగా ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లైంది.
ఇక స్వామివారి దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ నేరు తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. అలాగే భక్తులతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేస్తారని తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. దాదాపు పదేళ్ల తర్వాత పవన్-అన్నా లెజ్నెవా కూతురు కనిపించడంతో ఆయన అభిమానులు ఆ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో పవన్ చిన్న కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ హామీలకు 300 రోజులు.. మ్యానిఫెస్టోలోని 6 గ్యారెంటీల్లోని 13 హామీలు అసంపూర్తిగా అమలు
తియ్యటి మాటలు చెప్పారు.. 420 హామీలు ఇచ్చారు.. అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీలు అమలుచేస్తామన్నారు.. దేవుళ్లపై ఒట్లు వేశారు.. కానీ, పాలనాపగ్గాలు చేపట్టి 300 రోజులైనా హామీల అమలును పట్టించుకోవడం లేదు. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఉద్యమకారులు, ఆటోడ్రైవర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కులవృత్తులు.. ఇలా సబ్బండవర్ణాల ప్రజల ఓట్లను దృష్టిలో పెట్టుకొని 420 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. వాటిని చూసి ప్రజలు ఆ పార్టీకి ఓట్లేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అక్టోబర్ ఒకటో తేదీనాటికి 300 రోజులైనా హామీలు అమలు కావడం లేదు. పాత ఆర్టీసీ బస్సుల్లో కష్టాల మధ్య మహిళల ఉచిత ప్రయాణం ఒక్కటే అమలవుతున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ మూడు మినహా మిగతా హామీలన్నీ అటకెక్కాయి. నిరుపేద మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ హామీలపై రేవంత్‌రెడ్డి సర్కారు కనీసం నోరు మెదపడం లేదు. వానకాలం సీజన్ అయిపోయినా రైతుభరోసా ఇవ్వలేదు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ నేటికీ సగం మంది రైతులకు దక్కనేలేదు. పింఛన్లు రూ.రెండువేల నుంచి నాలుగవేలకు, రూ.నాలుగువేల నుంచి ఆరు వేలకు పెంచుడు మాటలకు పరిమితమైంది. మహిళలకు నెలకు రూ.2,500 అందని ద్రాక్షగానే మిగిలింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ మాట నీటిమూటలా మారింది.
మొత్తం 42 పేజీలతో 420 హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ వర్గాలను ఆకట్టుకొనేలా హామీలను ప్రకటించింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాటిచ్చింది. కానీ, 300 రోజులు అయినా 420 హామీలో కనీసం పది పథకాలు కూడా పట్టాలెక్కలేదు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిందని రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో కుటుంబంలో ఒక్కరికే పింఛన్ అందితే, కుటుంబంలో అర్హులైన ఇద్దరికి పింఛన్ ఇవ్వడంతోపాటు రూ.2 వేలను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా పింఛన్లు రాకపోగా పాతవి కూడా సక్రమంగా అందటం లేదని వృద్ధులు, వితంతువులు వాపోతున్నారు. వానకాలం సీజన్ ముగిసిపోతున్నా కేసీఆర్ ఇచ్చిన రూ.10,000 రైతుబంధు నేటికీ అందలేదు. రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000పై కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదు. వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇచ్చే హామీపై విధివిధానాలైనా రూపొందించారా? అంటే అదీ లేదు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి దెబ్బతిన్నదని, ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందిస్తామన్న హామీ ఇంకెప్పుడు అమలుచేస్తారని ఆటోడ్రైవర్లు నిలదీస్తున్నారు.
- మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ
- ఏటా జూన్ 2 నాటికి అన్నిశాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్
- సెప్టెంబర్ 17లోపు వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న నియామకాల భర్తీ
- ఉపాధి కల్పించే వరకు ప్రతినెలా రూ.4,000 నిరుద్యోగ భృతి
- యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు
- ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు
- ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
- ప్రతి విద్యార్థికీ ఫ్రీ (ఇంటర్నెట్) వైఫై సౌకర్యం
- ప్రపంచస్థాయి క్రీడావర్సిటీని నెలకొల్పి గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
- రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
- రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 రైతు భరోసా
- వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్.
- రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు
- మూతపడిన చక్కెర కర్మాగాలు తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం
- నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యమకారులు, ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటిస్థలంతోపాటు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల సాయం
- తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
- ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు తక్షణం చెల్లింపు
- అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.18 వేలకు పెంచి ఈపీఎఫ్ పరిధిలోని తీసుకొనిరావడం
- రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్ విధానం అమలుచేయడం
- ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం
- నెలవారీ పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంపు
- దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంపు
- తొలి, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను గుర్తించిఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.25,000 పింఛన్
- అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ