రాష్ట్ర దేవాదాశాఖ మంత్రి కొండా సురేఖ పై బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ లో శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి మహిళ నాయకురాలు మాట్లాడుతూ తెలంగాణ బీసీ ఆడబిడ్డ కొండా సురేఖ కు రఘునందన్ రావు బీజేపీ ఎంపీ మెదక్ మెడలో దండ వేశాడని కళ్యాణ్ లక్ష్మి డబ్బులు ఇచ్చారా అని ఎగతాళి చేసి అవమానించిన కేటీఆర్, హరీష్ రావు దిష్టిబొమ్మల దహన సంస్కారం చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని బుద్ధి రాలేదని,వారికి రాజకీయ సంతాపం ప్రకటించినట్లు తెలిపారు.తెలంగాణ బడుగు బలహీనవర్గాల మహిళను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అందుకే మహిళలు బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. కెసిఆర్,హరీష్ రావు కేటీఆర్ లు బడుగు బలహీన వర్గాల ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరించారు. మహిళల గురించి బలుపు మాటలు మాట్లాడి ఓడిపోయిన సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో….. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫణింద్ర,రేష్మ 114 డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, మేకల మైకల్ గారు, లక్ష్మీనారాయణ గారు, నల్లికాంత్ గారు, రాజ ముదిరాజ్, శ్రీకాంత్ గుప్తా, శ్రీధర్ చారి, సోను, సతీష్, మహిళా డివిజన్ నాయకురాలు సంధ్య గారు, పొన్నం రజిత గారు, జోజమ్మ గారు, మారుతి గారు, యమునా,సుందరి, విజయలక్ష్మి, మమత, రమ్య, మరి మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.
01/10/2024
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?
దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
సెలవులలో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటి అలారం మరియు మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచింది.
మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళము అమర్చుకునడం మంచిది.
తాళము వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ యొక్క స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారము ఇవ్వండి.
మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.
మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, మరియు మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది.
నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోండి.
మీ ఇంట్లో అమర్చిన CC Camera లను online లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.
మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, News Papers & పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయాన్ని గమనించండి.
మెయిన్ డోర్ కి తాళం కప్ప వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది.
బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది.
మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పడం మంచిది.
మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు మరియు ఇంటిలోపల CC Camera లు అమర్చు కొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశం లో ఉంచండి.
అల్మరా మరియు కప్ బోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు మరియు దిండ్ల క్రింద, అల్మరా పైన, డ్రెస్సింగ్ టేబుల్ లో మరియు కప్ బొర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశం లో ఉంచడం చిది.
బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్ లకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోండి.
సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.
సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.
కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి.
మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా మా వాట్సాప్ నెంబర్ 9490617444 కు dial చేయండి.
హైడ్రా తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసింది: ధర్మపురి అర్వింద్
హైడ్రా తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లనే కూల్చేస్తున్నారని, బ్లాక్మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘రైతుదీక్ష’ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి పాలన కూడా కేసీఆర్ పాలనలాగే ఉందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతు గోసను తెలియజేసేందుకే బీజేపీ ఆధ్వర్యంలో ఈ దీక్షను చేపట్టామన్నారు. రైతుల ఆదాయాన్ని ప్రధాని మోదీ రెట్టింపు చేశారన్నారు. చిన్న చిన్న పంటలకు ఏమీ చేయలేని ప్రభుత్వాన్ని నిన్న కేసీఆర్ నడిపారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుపుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం చిన్నకారు రైతుని కూడా ఆదుకోలేకపోయాయని అన్నారు. రైతుల హామీల సాధన కోసం తెలంగాణ బీజేపీ ప్రతినిధులు చేపట్టిన 24 గంటల దీక్ష కాంగ్రెస్ కుంభస్థలంపై కుంపటిగా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా బీజేపీ వదిలిపెట్టదని హెచ్చరించారు.
ఏళ్లు గడుస్తున్న హై టెన్షన్ రహదారికి మోక్షం కలగడం లేదు కూకట్పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్ సమీపం లో ఉన్న హై టెన్షన్ రహదారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. ఓవైపు రోడ్డు నిర్మాణం చేపట్టి మరోవైపు వదిలేయడంతో మాధవరం నగర కాలనీవాసులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. నిత్యం ఈ రహదారిలో వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రోడ్డు పూర్తి చేస్తే కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనేకమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న దాఖలు లేవు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి… కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన రేవంత్…. కాంగ్రెస్ అగ్ర నేతలను కలిశారట.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఒక్కరిది కాదని… అందరి నిర్ణయాలు గౌరవించాలని రాహుల్ గాంధీ చురకలాంటించారట. ఒంటెద్దు పోకోడాలతో ఎందుకు వెళ్తున్నామని ఫైర్ అయ్యారట.సీనియర్ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదని… అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలని ఆదేశించారట. జాతీయస్థాయిలో బిజెపి కూల్చివేతలకు వ్యతిరేకంగా… తాను పోరాటం చేస్తుంటే.. నువ్వు హైదరాబాదులో హైడ్రా పేరుతో కూల్చుతావా? అని నిప్పులు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అటు కేసి వేణుగోపాల్ తో.. కూడా ఇదే అంశాన్ని తెలిపారట. దీంతో.. రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ కూడా క్లాస్ పీకినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామి మూల విరాట్టును భానుడి కిరణాలు మంగళవారం ఉదయం తాకాయి.. ఉదయం 6.05 గంటలకు సూర్య కిరణాలు ధ్వజ స్తంభం మీదుగా స్వామిని చేరాయి. ఆ సమయంలో మూల విరాట్ బంగారు ఛాయలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేకువజాము నుంచే క్యూ లైన్లలో బారులు దీరారు..
సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి వేళ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
రజినీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో పాటు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ముందుగానే ప్లాన్ చేసుకున్న ఈ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారు. గుండెకు సంబంధించిన పరీక్షల కోసం రజినీకాంత్ చేరినట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రజినీకాంత్ సన్నిహితులు తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపై రజినీకాంత్ కుటుంబ సభ్యులు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
ఇక ప్రస్తుతం రజినీకాంత్ వెట్టయాన్, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. వెట్టయాన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నవరాత్రులకు ముందు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఇది చేదువార్తే. వరుసగా మూడవ నెల అక్టోబర్లో కూడా గ్యాస్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు నేటి (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి.
కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.