ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆఫీస్‌కు పిలిపించుకొని యువతిపై అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బొరబండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతికి ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కార్యాలయానికి రమ్మని కబురు పంపాడు. కార్యాలయం వచ్చిన తరువాత ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. దీంతో యువతి ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
03/08/2024
రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదు..నియంతృత్వ పాలన : మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని, అసెంబ్లీని కౌరవ సభలా ఇష్టారాజ్యంగా నడిపించారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో బీఆరెస్ గొంతు నొక్కారని, జీరో అవర్ మొత్తం ఎత్తివేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు. సభలో చర్చలకు, ప్రజా సమస్యలపై మాట్లాడితే మైకులు కట్టేశారని.. ఇదేంటని అడిగితే మార్షల్స్‌తో బయటకు తరలించారని మండిపడ్డారు. రేవంత్ సభా నాయకుడిగా కాకుండా అటవిక రాజులా వ్యవహరించారన్నారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుడు దోవ పట్టించారని విమర్శించారు. ఏ చర్చపై కూడా పూర్తిగా మాట్లాడనివ్వలేదని, కేసీఆర్‌ను తిట్టుడు.. గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే సభ నడించిందని అన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టిందని తెలిపారు.కాంగ్రెస్ హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తాము మాట్లాడామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా వంద రోజుల్లో అమలుచేస్తామన్న హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్తు్ ఒప్పందంలో వ్యవసాయ మోటార్లకు మినహాయింపు ఉన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తొక్కిపెట్టి తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును ప్రేవేటికరించమని చెప్పి దాన్ని బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా కేంద్ర తీరు ఉందని మండిపడ్డారు.ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ముడిపదార్థాలు నిండుకున్నాయని, కొనేందుకు చిల్లగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమేనని యాజమాన్యం చేతులెత్తేస్తుంటే.. మోదీకి కనీసం చీమైనా కుట్టినట్లు లేదని షర్మిల మండిపడ్డారు. పోనీ అప్పు తెద్దామా అంటే గ్యారంటీకి కూడా కనికరం లేదని అన్నారు.
ఏపీ ఎంపీల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికమైన విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారని షర్మిల విమర్శించారు. లేదు లేదు అంటూనే ఆయన దోస్తులకు విశాఖ ఉక్కును కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపిచంఆరు. కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్ర వేసినట్లుగా.. విశాఖ స్టీల్‌కు ఒక్క రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారని అన్నారు. నిధులు ఇవ్వకుండా సైలెంట్‌గా విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే అదానీ, అంబానీ, జిందాల్ వంటి వాళ్లకు విశాఖ ఉక్కును కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ నేతలను, కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ, జనసేన పార్టీలను హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేకుంటే.. ప్లాంట్ బలోపేతంపై మీకు చిత్తశుద్ధి ఉంటే.. తక్షణం ఆర్థిక సాయం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌కు కావాల్సిన ముడి పదార్థాలు వెంటనే సమకూర్చాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్‌కు పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని వెలికితీస్తామన్న రేవంత్‌రెడ్డి 9 నెలలు అయినా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ‘రేవంత్ .. ఏమైంది నీ పౌరుషం.. చచ్చిపోయిందా?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో నిన్న మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయనంతకాలం ఆమెను అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, అరెస్ట్ చేశాక మాట మార్చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు అసెంబ్లీ సమావేశాలను ఏదో మొక్కుబడిగా నిర్వహించారని విమర్శించారు. ఇప్పుడు సజావుగా జరగడం సంతోషమని వ్యాఖ్యానించారు. సభలో ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు.
అసెంబ్లీ నుంచి కేటీఆర్‌ను మార్షల్స్ ఎత్తుకుపోవడంపైనా అర్వింద్ స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి (బీఆర్ఎస్) ప్రజలు కనబడలేదని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని పేర్కొన్నారు. తాను ఒక క్రికెటర్ని అని, ఒక బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరితే ఎలా ఉంటుందో, అదే స్పీడ్‌తో కేటీఆర్‌ను మార్షల్స్ బయటకు విసిరేశారని పేర్కొన్నారు. ఇక, తమ పార్టీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే నేతకే అధ్యక్ష పదవి దక్కుతుందని అర్వింద్ తేల్చి చెప్పారు.
ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిం చింది. అసెంబ్లీలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి నియామకాల వివరాలను ఇందులో పొందుపరిచారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెలతోపాటు, నియామక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు, పరీక్ష నిర్వహించే బోర్డు, ఉద్యోగ అర్హతలు వంటి వివరాలను ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చినమాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించామని వివరించారు. దీనికి సంబంధించి ఈనెల ఒక టిన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి ఏటా నిర్దిష్టమైన కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు వీలుగా జాబ్ క్యాలెండర్‌ను క్యాబినెట్ ఆమోదించిందని గుర్తు చేశారు. వాస్తవానికి నోటిఫికేషన్ల జాప్యం, తరచూ వాయిదాలతో నిరుద్యో గులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా ఉండేదని అన్నారు. గతంలో గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింద న్నారు. తాము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ తప్పిదాలు, అనాలో చిత నిర్ణయాలు, పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేశామని వివరించారు. అందులో భాగంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయడంతో పాటు పలు పరీక్షలకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2ను వాయిదా వేశామని అన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి పోస్టుల వివరాలను నోటిఫికేషన్లను విడుదల చేసినపుడు
ఫిబ్రవరిలో డీఎస్సీ, మేలో గ్రూప్-2 నోటిఫికేషన్ ఆయా నియామక సంస్థలు ప్రకటిస్తాయని వివరించారు.
జాబ్ క్యాలెండర్ 2024-25 వివరాలు నోటిఫికేషన్ పేరు నోటిఫికేషన్ తేదీ పరీక్ష తేదీ నియామక సంస్థ
1. గ్రూప్-1 ఫిబ్రవరి -2024 అక్టోబర్-2024 టీజీపీఎస్సీ మెయిన్స్)
2. గ్రూప్-3 డిసెంబర్-2022 నవంబర్-2024 టీజీపీఎస్సీ
3. ల్యాబ్‌టెక్నీషియన్ సెప్టెంబర్-2024 నవంబర్-2024 ఎంహెచ్ఎస్ఆర్బీ
(గ్రేడ్-2) నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్)/ఫార్మాసిస్ట్ గ్రేడ్-2/ ఫార్మాసిస్ట్ (ఆయూష్)
4. గ్రూప్-2 డిసెంబర్-2022 డిసెంబర్-2024 టీజీపీఎస్సీ
5. ఇంజినీరింగ్ అక్టోబర్-2024 జనవరి-2025 టీజీట్రాన్స్‌కో
ఇతర పోస్టులు, (టీజీ ట్రాన్స్‌కో, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్)
6. గెజిటెడ్ కేటగిరీ అక్టోబర్-2024 జనవరి-2025 టీజీపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసులు
7. టెట్ నవంబర్-2024 జనవరి-2025 విద్యాశాఖ
8. గ్రూప్-1 అక్టోబర్-2024 ఫిబ్రవరి-2025 టీజీపీఎస్సీ (ప్రిలిమ్స్)
9. గెజిటెడ్ జనవరి-2025 ఏప్రిల్-2025 టీజీపీఎస్సీ స్కేల్ ఇతర ప్రొఫెషనల్ సర్వీసులు
10. డీఎస్సీ ఫిబ్రవరి-2025 ఏప్రిల్-2025 విద్యాశాఖ
11. ఫారెస్ట్ ఫిబ్రవరి-2025 మే-2025 టీజీపీఎస్సీ బీట్ ఆఫీసర్
12. టెట్ ఏప్రిల్-2025 జూన్-2025 విద్యాశాఖ
13. గ్రూప్-1 — జులై-2025 టీజీపీఎస్సీ మెయిన్స్
14. ఎస్ఐ ఏప్రిల్-2025 ఆగస్టు-2025 టీజీపీఆర్బీ సివిల్, ఇతర సివిల్, ఇతర పోస్టులు ప్రిలిమ్స్
15. కానిస్టేబుల్ ఏప్రిల్-2025 ఆగస్టు-2025 టీజీపీఆర్బీ సివిల్, ఇతర పోస్టులు ప్రిలిమ్స్
16. డిగ్రీ కాలేజీల్లో జూన్-2025 సెప్టెంబర్-2025 టీజీపీఎస్సీ అకడమిక్ పోస్టులు
17. గురుకుల, జూన్-2025 సెప్టెంబర్-2025 టీఆర్ఈఐబీ డిగ్రీ లెక్చరర్లు
18. గ్రూప్-2 మే-2025 అక్టోబర్-2025 టీజీపీఎస్సీ (ఎఫ్ఆర్వో కలిపి)
19. గ్రూప్-3 జులై-2025 నవంబర్-2025 టీజీపీఎస్సీ (గ్రూప్-4 పోస్టులు కలి