జింబాబ్వే నుంచి 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు హరారే చేరుకున్నారు. అక్కడ ఆ దేశ క్రికెట్ సంఘం ప్రతినిధులు ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు.. కాగా, ఈ పర్యటనలో భారత జట్టు జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడానుంది. జింబాబ్వే టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. వీవీఎస్ లక్ష్మణ్ ఈ పర్యటనలో భారత ఆటగాళ్లతో పాటు కోచ్ గా కొనసాగనన్నాడు.
ఇక శుభ్‌మాన్ గిల్ సారథ్యంలోని టీం ఇండియా హరారేకు చేరుకున్న ఫొటోలు, వీడియోలను జింబాబ్వే క్రికెట్ బోర్డు తన X హ్యాండిల్‌లో షేర్ చేసింది. టీమ్ ఇండియాలోని మిగతా ఆటగాళ్లు భారత్ నుంచి విమానంలో జింబాబ్వే చేరుకున్నారు. కాగా, టీ20 సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ అమెరికా నుంచి నేరుగా హరారే చేరుకున్నాడు.
అమెరికాలో సెలవుల అనంతరం జింబాబ్వే చేరిన గిల్..
2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా గిల్ భారత జట్టు రిజర్వ్ స్క్వాడ్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, గ్రూప్ దశ తర్వాత జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. జట్టు నుంచి విడుదలైన తర్వాత, గిల్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక, ఇప్పుడు అక్కడి నుంచి విమానం ఎక్కి హరారేలో టీమ్‌లో జాయిన్ అయ్యాడు.