మంత్రి కొండా సురేఖపై అభ్యంతరకర పోస్టులను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం

google-display-ads-size-468x60-1

రాష్ట్ర దేవాదాశాఖ మంత్రి కొండా సురేఖ పై బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ లో శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి మహిళ నాయకురాలు మాట్లాడుతూ తెలంగాణ బీసీ ఆడబిడ్డ కొండా సురేఖ కు రఘునందన్ రావు బీజేపీ ఎంపీ మెదక్ మెడలో దండ వేశాడని కళ్యాణ్ లక్ష్మి డబ్బులు ఇచ్చారా అని ఎగతాళి చేసి అవమానించిన కేటీఆర్, హరీష్ రావు దిష్టిబొమ్మల దహన సంస్కారం చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని బుద్ధి రాలేదని,వారికి రాజకీయ సంతాపం ప్రకటించినట్లు తెలిపారు.తెలంగాణ బడుగు బలహీనవర్గాల మహిళను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అందుకే మహిళలు బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. కెసిఆర్,హరీష్ రావు కేటీఆర్ లు బడుగు బలహీన వర్గాల ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరించారు. మహిళల గురించి బలుపు మాటలు మాట్లాడి ఓడిపోయిన సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో….. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫణింద్ర,రేష్మ 114 డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, మేకల మైకల్ గారు, లక్ష్మీనారాయణ గారు, నల్లికాంత్ గారు, రాజ ముదిరాజ్, శ్రీకాంత్ గుప్తా, శ్రీధర్ చారి, సోను, సతీష్, మహిళా డివిజన్ నాయకురాలు సంధ్య గారు, పొన్నం రజిత గారు, జోజమ్మ గారు, మారుతి గారు, యమునా,సుందరి, విజయలక్ష్మి, మమత, రమ్య, మరి మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1